డయాబెటిస్ ఉంటే బంగాళాదుంపలు పూర్తిగా మానేయాలా? డయాబెటిస్ వస్తే తీసుకునే ఆహారంలో కోతలు తప్పవు. కొన్ని రకాల ఆహారపదర్థాలు తినకూడదు, కొన్ని తినవచ్చు కానీ అధికంగా తినకూడదు. డయాబెటిక్ రోగులను బంగాళాదుంపలను తినవద్దని సూచిస్తారు ఆరోగ్యనిపుణులు. దీనికి కారణం అందులో కార్బోహైడ్రేట్లు. మధుమేహం ఉన్న వ్యక్తికి కార్బోహైడ్రేట్లను గ్రహించడం కష్టంగా మారుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అలాగని డయాబెటిస్ రోగులు పూర్తిగా బంగాళాదుంపలు మానేయాలని లేదు. బంగాళాదుంపలను బాగా ఉడికిస్తే కార్బోహైడ్రేట్ల శాతం తగ్గుతుంది. కాబట్టి బాగా ఉడికించాలి. అలాగే మెంతి, పాలకూర, బెండకాయ వంటి వాటితో కలిపి వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గితే బంగాళాదుంపలు తినవచ్చు. కానీ మితంగానే తినాలి. చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్, వేపుళ్లు వంటివి మాత్రం తినకూడదు.