అన్ని రకాల చర్మం, జుట్టు, ఆరోగ్య సమస్యలని నయం చేయగలిగే అత్యంత ప్రసిద్ధ మూలికల్లో ఒకటి కలబంద.



అలోవెరా జెల్ ముడతలు, మొటిమలని నివారించడం ద్వారా చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.



పోషకాలు అధికంగా ఉండే కలబందలో 20 ఖనిజాలు, 18 అమైనో ఆమ్లాలు, 12 విటమిన్లతో సహ 75 కంటే ఎక్కువ పోషక భాగాలు, 200 ఇంతర కాంపౌండ్స్ ఉన్నాయి.



అలోవెరా జెల్ రాసుకోవడం వల్ల చర్మం సహజ తేమను పొందుతుంది. మొక్క నుంచి నేరుగా జెల్ తీసుకుని చర్మానికి మాయిశ్చరైజర్ గా రాసుకోవచ్చు.



మొటిమలు వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది.



అలోవెరాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల బారిన పడిన చర్మాన్ని రక్షిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యని కలబంద నయం చేస్తుంది.



కలబంద గుజ్జు తలకి రాసుకోవడం వల్ల కుదుళ్లు గట్టి పడతాయి. జుట్టు పెరుగుదలని ప్రోత్సాహిస్తుంది.



చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలని తొలగిస్తుంది. దద్దుర్లు, మొటిమలు, గాయాలని నయం చేస్తుంది.



మచ్చలు లేని చర్మం కోసం వారానికి రెండు సార్లు అలోవెరా ఐస్ క్యూబ్స్ ఉపయోగించుకుని మెరిసే చర్మాన్ని పొందొచ్చు.



చలికాలంలో చర్మం పొడి బారిపోయి చికాకు పెడుతుంది. ఈ సమస్యకి చక్కని పరిష్కారం కలబంద.