ఆయుర్వేదం ప్రకారం ఉదయం 6-10 గంటల మధ్య కాలాన్ని కఫ కాలం అంటారు. అందుకే ఈ టైమ్ లో ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదని అంటున్నారు.



పండ్లు చల్లగా, తీపి, పులుపు, ఆస్ట్రిజెంట్ రుచులతో ఉంటాయి. పండ్లలో సాధారణ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి వేగంగా జీర్ణమవుతాయి.



అల్పాహారంలో పండ్లు తీసుకోవద్దని చెప్పేందుకు ప్రధాన కారణం ఆ సమయంలో జీర్ణ మంట తక్కువగా ఉంటుంది. చల్లని ఆహారాలు దాన్ని మరింత తగ్గిస్తాయి.



మనం తీసుకునే అల్పాహారం వెచ్చగా, సులభంగా జీర్ణం అయ్యేది ఉండాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.



కొంతమందికి అల్పాహారంలో పండ్లు తీసుకోకపోతే అసంపూర్తిగా తిన్నామనే భావన వస్తుంది.



దాల్చిన చెక్క, లేదా శొంటి (అల్లం పొడి) వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించి పండ్లు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.



వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు కూడా ఉదయం పూట పండ్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.



పాలు, అరటి పండు కూడా కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే అది మెదడు పనితీరుని నెమ్మదించేలా చేస్తుంది.



బలమైన జీర్ణశక్తి ఉన్నవాళ్ళు పండ్లు తీసుకున్నా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు.
శారీరకంగా చురుకుగా ఉండే వారికి కూడా ఇది సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు.