కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, అనేక ఇతర పోషకాలతో నిండిన గుడ్లు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.



గుడ్డు సొనల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది.
ఇది అధిక రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.


గుడ్డులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తింటే చాలు కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపు చేసుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.



గుడ్లు అతిగా తినడం దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.



అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తసరఫరాకి ఆటంకం ఏర్పరుస్తుంది.
ధమనుల ద్వారా తగినంత రక్తం ప్రవహించడం కష్టతరం చేయడం వల్ల గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.


ఉడికించిన గుడ్లు తిన్నా కూడా కొవ్వు స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.



అలా అని గుడ్లు తినొద్దని కాదు మితంగా తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.



రోజుకొక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఉడికించిన గుడ్డు సుమారు 77 కేలరీలు కలిగి ఉంటుంది.



గుడ్డులో విటమిన్లు ఏ, బి 5, బి 12, డీ, ఇ, కె, బి 6తో పాటు ఫోలేట్, భాస్వరం, సెలీనియం
కాల్షియం, జింక్, ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి.