మహిళలు గర్భం ధరించిన మొదటి త్రైమాసికం తర్వాత అదనంగా 300 కేలరీలు తీసుకోవాలి. ఇవి కడుపులోని బిడ్డకి చేరతాయి. సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యమే. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే కడుపులోని పిండం శరీర నిర్మాణం అభివృద్ధికి కాల్షియం ఉపయోగపడుతుంది. రోజుకొక గుడ్డు ఉడకబెట్టుకుని తినడం చాలా అవసరం. ఎముకలని బలోపేతం చేసి శిశువు ఎముకలు, కండరాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఫోలేట్, పొటాషియం, ఐరన్ పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకేరెల్, హెర్రింగ్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చిలగడదుంపలో బీటా కెరోటిన్ అధిక స్థాయిని కలిగి ఉంటుంది. కాబోయే తల్లులకి విటమిన్ ఏ చాలా అవసరం. పిండం కణజాలం అభివృద్ధికి దోహదపడుతుంది. బ్రకోలి వంటి ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. ఆకుపచ్చ కూరగాయాల్లో ఫైబర్, విటమిన్ సి, కె, ఏ, కాల్షియం, ఐరన్, ఫోలేట్, పొటాషియం ఉన్నాయి. కాబోయే తల్లులో పాలు ఉత్పత్తి చేయడానికి బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, వేరుశెనగ తప్పనిసరిగా తీసుకోవాలి. బెర్రీలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ ప్రభావాలని కలిగి ఉంటుంది.