బియ్యం పిండితో రకరకాల పిండి వంటలు, స్వీట్స్ చేసుకుని తింటారు. కానీ దానితో మెరిసే చర్మాన్ని కూడా పొందొచ్చు.
చర్మం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కనిపించేలా చేసేందుకు బియ్యం పిండి ఉపయోగించుకోవచ్చు. ఒకప్పుడు క్రీములు లేనప్పుడు బియ్యం పిండితోనే నాచురల్ స్కిన్ టోన్ పొందేవాళ్ళు.
బియ్యం పిండిలో కొన్ని చుక్కల తేనె, కొబ్బరి నూనె జోడించి రాసుకోవడం వల్ల మృదువైన చర్మం పొందుతారు.
వృద్ధాప్య ఛాయలు పోగొట్టుకునేందుకు బియ్యం పిండి, గుడ్డులోని తెల్ల సొన, గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి.
అండర్ ఆర్మ్స్ లో టాల్కమ్ కి బదులుగా బియ్యం పిండి రాసుకుంటే దుర్వాసన ఉండదు.
ఆయిల్ లేని చర్మం అందిస్తుంది. బియ్యం పిండి ఉపయోగించడం వల్ల చర్మ రంద్రాలు బిగుతుగా మారతాయి. చర్మాన్ని టోన్ చేస్తుంది.
హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వదులుగా ఉండే చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.
ఎండవల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని డి టాన్ చేసేందుకు సహకరిస్తుంది.
ఓట్స్ తో కలిపి బియ్యం పిండి రాసుకుంటే చర్మాన్ని మృదువుగా హైడ్రేట్ గా ఉంచుతుంది.
బియ్యం పిండి, ఆముదం కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని తొలగిస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం నాచురల్ గ్లో కావాలంటే ఇలా చేసేయండి. Images Credit: Pexels