వీటితో చేసిన పిండి డయాబెటిక్ రోగులకు మంచిది

డయాబెటిక్ రోగులు ప్రత్యేకంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండే డైట్ పాటించాలి.

కొన్ని రకాల పిండిలను రెడీ చేసి పెట్టుకుంటే ఆకలేసినప్పుడల్లా వాటితో ఏదో ఒకటి చేసుకుని తినవచ్చు.

రాగి పిండి - దీనిలో కరిగే ఫైబర్ నిండుగా ఉంటుంది. తరచూ ఆకలేయకుండా అడ్డుకుంటుంది.

జొన్న పిండి - యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది.

బార్లీ పిండి - జీవక్రియను మెరుగుపరుస్తుంది.

కొమ్ము శెనగల పిండి - ఈ పిండితో అట్లు చేసుకోవచ్చు, చపాతీలా కాల్చుకోవచ్చు.

ఇవన్నీ యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తాయి.