ప్రొటీన్ పొడిని ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి




జిమ్‌కెళ్లేవారి ప్రతి బ్యాగులో ప్రొటీన్ షేక్ బాటిల్ కచ్చితంగా ఉంటుంది. కండ పుష్టి కోసం దీన్ని తాగడం అలవాటు చేసుకున్నారు.



గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, పుచ్చగింజలు, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు... వీటిని విడి విడిగా కొనుక్కోవాలి.



ఈ పప్పులన్నింటినీ సమపాళ్లలో తీసుకోవాలి. ఈ పప్పులను విడి విడిగా కళాయిలో (నూనె వేయకూడదు) వేయించుకోవాలి.



తరువాత వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేయాలి. ఎండు ఖర్జూరాలను లోపల విత్తనం తీసేసి ముక్కలుగా చేసి అందులో వేయాలి.



మంచి సువాసన కావాలంటే రెండు యాలకులు కూడా వేసుకోవచ్చు. ఈ పొడిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టేయాలి. గాలి తగలనివ్వకూడదు.



పాలల్లో హార్లిక్స్ వంటివి ఎలా కలుపుకుని తాగుతారో అలాగే దీన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకుని కలుపుకుని తాగేయడమే.



పిల్లలకు తాగిస్తే చాలా మంచిది. తెలివి తేటలు బాగా పెరుగుతాయి. బలంగా, పుష్టిగా కూడా తయారవుతారు.



బయట మార్కెట్లో దొరికే పొడుల కన్నా ఇంట్లో చేసిన ఈ ప్రొటీన్ పొడి చాలా మేలు చేస్తుంది.