అరటిపండు మెత్తగా చేసి డాన్ని మొహం, మెడ అంతా అప్లై చేసుకుని 15 నిమిషాలు ఉంచుకుని వాష్ చేసుకోవాలి.

చర్మ సంరక్షణకి అద్భుతమైనది రోజ్ వాటర్. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

టొమాటోతో మొహం, మెడ, పాదాలు, చేతులు రుద్దుకోవచ్చు. చర్మం మీద టాన్ ని తొలగిస్తుంది.

ప్రతి రోజు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగితే చర్మానికి చాలా మంచిది. ఇది తాగితే మాయిశ్చరైజర్ అవసరమే లేదు.

ఎటువంటి ఫేస్ మాస్క్ అయినా అందులో ఒక చిటికెడు పసుపు కలుపుకున్నారంటే మెరిసే చర్మం పొందుతారు.

కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగడం వల్ల స్కిన్ నిగనిగలాడుతుంది.

శరీరానికి విటమిన్ సి అందించే నిమ్మకాయ తీసుకోవచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.

పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. తలస్నానం చేసే ముందు పెరుగు అప్లై చేసుకుంటే చర్మాన్ని సంరక్షిస్తుంది.

పుష్కలంగా నీరు తాగాలి. అప్పుడే చర్మం నిగనిగలాడుతుంది. డీహైడ్రేట్ అయితే చర్మం పొడిగా మారి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.