పాలు తాగడం ఇష్టం లేనివారికి కాల్షియం కావాలంటే ఈ ఆహారపదార్థాలను తింటే సరిపోతుంది. కాల్షియం లోపం తలెత్తకుండా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహారాలను రోజూ తినాలి. 200 గ్రాముల టోఫు తింటే 700 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. టోఫు, పనీర్ లాగే ఉంటుంది. గుప్పెడు బాదం పప్పులు రోజూ తిన్నా చాలు, శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. పప్పులు పచ్చిగా తిన్నా, నానబెట్టుకుని తిన్నా మంచిదే. ఒక కప్పు పెరుగు తింటే 300 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. పెరుగులో తాజా పండ్లు వేసుకుని తింటే చాలా మంచిది. నాలుగు స్పూన్ల నువ్వులు రోజూ తింటే దాదాపు 350 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. రెండు కప్పుల కొమ్ముశెనగలలో 420 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇనుము కూడా శరీరానికి పుష్కలంగా అందుతుంది. నాలుగు టేబుల్ స్పూన్ల చియా గింజలు తింటే 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. స్మూతీస్ లో వేసుకుని తాగొచ్చు. రాగి పిండితో చేసే వంటకాలు రోజూ తింటే కాల్షియం పుష్కలంగా అందుతుంది. రాగి జావ, అట్టు, లడ్డూలు చేసుకుని తినొచ్చు.