సెలవు రోజుల్లో వచ్చే గుండె జబ్బుల గురించి తెలుసా? సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతారంతా. ఆ రోజంతా తాగడం, తినడం, తిరగడం ఇవి చేయడానికి ఇష్టపడతారు. సెలవుల్లో మద్యపానానికే ప్రాధాన్యత ఎక్కువ. అడ్డూ అదుపు లేకుండా తాగే వారు ఎంతో మంది. అలా తాగి తాగి గుండెకు చేటు తెచ్చుకుంటారు. అమెరికాలో హృదయ సంబంధ వ్యాధులు కలగడానికి సాధారణ కారణాల్లో ఇదీ కూడా ఒకటి. ఎక్కువగా సెలవురోజుల్లోనే ఈ గుండె జబ్బులు వస్తాయి కాబట్టి దీనికి ‘హాలీడే హార్ట్ సిండ్రోమ్’ అని పేరు వచ్చింది. హాలిడే హార్ట్ సిండ్రోమ్ కేసులు అధికంగా కిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో నమోదవుతున్నట్టు చెబుతున్నాయి సర్వేలు. ముఖ్యంగా వయసు పెరిగిన వారిలో, మధుమేహం ఉన్నవారి, కరోనరీ ఆర్టరీ వ్యాధుల చరిత్ర ఉన్న వారిలో ఈ సిండ్రోమ్ వెలుగు చూస్తోంది. సెలవుల్లో బాగా తాగి, తిన్నాక గుండెదడ, అలసట, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం వంటివి జరిగితే వైద్యులను సంప్రదించాలి. సెలవుల్లో ఆనందం, ఉల్లాసంగా ఉండటం చాలా అవసరం, అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.