దాల్చినచెక్క యాంటీ డయాబెటిక్ ఏజెంట్, యాంటీఆక్సిడెంట్ ఏజెంట్, యాంటీమైక్రోబయల్ ఏజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పని చేస్తుంది.

గుండె సంబంధిత, టైపు 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చలికాలంలో బరువు తగ్గడానికి దాల్చిన చెక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్కతో చేసిన టీ జీవక్రియని పెంచడానికి సహాయపడుతుంది.

దాల్చిన చెక్క కర్ర లేదా పొడిని నీటిలో బాగా మారిగించుకుని అందులో రుచి కోసం నిమ్మరసం లేదా తేనె జోడించుకోవచ్చు.

దాల్చిన చెక్క టీ వారాన్నికి మూడుసార్లు మాత్రమే తాగాలి. అయితే శీతాకాలంలో రోజు తాగినా చక్కని ఫలితాలు పొందుతారు.

కూరలు, ఆహారం మీద కూడా దాల్చిన చెక్క పొడి చల్లుకుని తినొచ్చు.

దాల్చిన చెక్క నీటిని పడుకునే ముందు తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

ఓట్మీల్ పై పొడి చల్లుకుని తినొచ్చు. బరువు తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

పండ్ల రసంలో నల్ల ఉప్పు కాకుండా చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగొచ్చు.

రైస్ కుక్కర్ లో కాసింత దాల్చిన చెక్క వేస్తే నీరు లాగేస్తుంది. రుచి కూడా బాగుంటుంది.
Image Credit: Pexels