కూరను టేస్టీగా మార్చే పదార్థాలు ఇవే

కూరలో అదనంగా వీటిని వేయడం వల్ల మంచి రుచి వస్తుంది.

నెయ్యి - దీన్ని వేయడం వల్ల కూరకు మంచి సువాసన వస్తుంది.

జీలకర్ర - పప్పుకు ప్రత్యేక రుచిని ఇచ్చేవి ఇవే. నూనెలో వేయించి ఉడికించిన పప్పులో కలుపుకోవాలి.

టమాటా ప్యూరీ - ఇగురు కోసం టమాటో ప్యూరీని వేస్తే మంచి రుచి వస్తుంది.

ధనియాల పొడి - కొన్ని రకాల కర్రీలకు ధనియాల పొడి వేయగానే ప్రత్యేకమైన టేస్టు వస్తుంది.

అల్లం వెల్లుల్లి పేస్టు - మాంసాహారానికి ఇది చాలా అవసరం. నూనెలో దీన్ని వేయిస్తే వచ్చే వాసనే వేరు.

గరం మసాలా - మాంసాహారం, శాకాహార కూరలకు చిటికెడు వేస్తే చాలు.

కొత్తి మీర - బిర్యానీ,కూరలకు వీటిని జత చేరిస్తే చాలు ఘుమఘుమలాడిపోతుంది వంటకం.