ఊపిరితిత్తుల ఆరోగ్యం, శరీరంలోని పేరుకుపోయేటువంటి కఫం, శ్లేష్మం పోగొట్టుకునేందుకు ఈ డికాషన్ చాలా ఉపయోగపడుతుంది.



ఈ డికాషన్ కి కావలసిన పదార్థాలు
తరిగిన ఉల్లిపాయ- 1 టేబుల్ స్పూన్
బెల్లం- 1 టేబుల్ స్పూన్
పసుపు- ¼ టీస్పూన్
నల్ల మిరియాల పొడి చిటికెడు


కొద్దిగా నీళ్ళు తీసుకుని వాటిలో ఈ మిశ్రమాలు అన్నీ వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.


ఉల్లిపాయతో చేసే డికాషన్ లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది కఫాన్ని అదుపులో ఉంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.



ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక శ్లేష్మ ఉత్పత్తిని నిరోధిస్తుంది.
ఇక బెల్లం కఫాన్ని తొలగించి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.


నల్ల మిరియాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.



పసుపులోని కర్కుమిన్ శ్లేష్మ ఉత్పత్తిని ప్రేరేపించే ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సహాయపడుతుంది.



ఈ పానీయం గొంతు చికాకుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తుంది.



రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం కోసం తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్ డికాషన్ తీసుకోవడం మంచిది.