అతిగా మద్యం తాగితే ఏమవుతుందంటే...

బీర్ నుంచి విస్కీ దాకా అన్ని రకాల మద్యాన్ని తాగి కిక్కెక్కిపోతుంది యువత.అలా తాగే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

మద్యం శరీరంలో చేరాక ప్రభావం మొదట పడేది మెదడుపైనే. మితంగా తాగితే మెదడు ఉల్లాసంగా ఉంటుంది.

అధికంగా తాగితే మెదడు పనిచేసే విధానం మందకొడిగా మారుతుంది. శ్వాస కూడా నెమ్మదిగా ఆడుతుంది.

గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది. అతిగా తాగడం వల్ల రక్తంలో ఆల్కహాల్ చేరుతుంది.

దీనితో శరీర అవయవాల మధ్య సమన్వయం ఉండదు. విచక్షణ కూడా లోపిస్తుంది.

అతిగా మద్యం తాగేవారికి కాలేయ జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

కాబట్టి కొత్త ఏడాదిని కేవలం మద్యం తాగుతూనే ఆహ్వానించాలని లేదు, ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి.

వీలైనంత వరకు ఒక గ్లాసుతో ఆపేయడానికే చూడాలి.