బుగ్గల్లో సొట్ట ఎందుకు పడుతుంది?

బుగ్గలో సొట్ట పడితే ఆ అందమే వేరు. బుగ్గసొట్టలు అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ప్రత్యేక ఆకర్షణ.

సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు చాలా లక్కీ ఫెలోస్ అని, వారికి జీవితంలో డబ్బుకు లోటుండదని చెప్పుకుంటారు.

కానీ సైన్సు ప్రకారం సొట్ట బుగ్గలు పడడం వెనుక మానవ శరీర నిర్మాణమే కారణం.

ముఖంలోని ప్రధాన కండరం జైగోమాటికస్ సాధారణంగా చెంప ఎముక నుంచి మన నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది.

కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండు వేర్వేరు చిన్న కండరాలుగా విడిపోతుంది. ఇందులో ఒకటి నోటి చివర వరకు వెళుతుంది. ఇంకోటి మాత్రం నోటి మూలలో ఆగిపోతుంది.

ఆ రెండు కండరాల మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అప్పుడు నవ్వినప్పుడు అక్కడ లోతుగా సొట్ట పడుతుంది.

తల్లికి లేదా తండ్రికి సొట్ట బుగ్గలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంది.

ఈ ప్రపంచ జనాభాలో దాదాపు 20 నుంచి 30 శాతం మందికి సొట్టబుగ్గలు ఉన్నట్టు అంచనా.