కంది పప్పు దోశెలు ఎప్పుడైనా తిన్నారా?


కంది పప్పు - అర కప్పు
బియ్యం - ఒక కప్పు
కాస్త పుల్లటి మజ్జిగ - ఒక కప్పు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిరపకాయలు - రెండు
జీలకర్ర - ఒక స్పూను
వంట సోడా - చిటికెడు


కంది పప్పు, బియ్యం కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి.

ఒక గిన్నెలో ఆ పొడిని వేసి పుల్లటి మజ్జిగని వేసి బాగా గిలక్కొట్టాలి.

ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోవాలి.

చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటే మంచిది. వంటసోడా లేకపోతే ఈనో ప్యాకెట్ ఉన్న వాడుకోవచ్చు.

పెనంపై ఈ మిశ్రమాన్ని అట్లులా పోసుకోవాలి. రెండు వైపులా బంగారు వర్ణంలోకి మారాకా తీసి ప్లేటులో వేసుకోవాలి.

ఈ కంది పప్పు దోశెలు కొబ్బరి చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.