ఒక ఇంటిని కొంటేనే ఎంతో ఆనందపడిపోతాం, అలాంటిది ఒక ఊరినే కొంటే ఆ సంతోషమే వేరు.
ఊరిని అమ్ముతున్నారనగానే అందులో ఏమీ ఉండవు అనుకోవద్దు. ఎన్నో ఇళ్లు, చర్చి, బతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి.
ఈ ఊరు ఎక్కడుందో తెలుసా స్పెయిన్లో. ఆ గ్రామం పేరు సాల్డో డి క్యాస్ట్రో. ఇది పోర్చుగీసు సరిహద్దుల్లో ఉంది.
ఈ ఊళ్లో 44 ఇళ్లు, ఒక స్కూలు,ఒక హోటల్, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.
చాలా ఏళ్ల క్రితం ఇక్కడ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దానికి పనిచేయడానికి కావాల్సిన ఉద్యోగులను, కార్మికులను ఇక్కడికి కుటుంబంతో సహా తరలించారు.
వారి కోసమే ఈ ఇళ్లు కట్టారు. ప్రాజెక్టు పూర్తవ్వగానే వారంతా వెళ్లిపోయారు. 30 ఏళ్లుగా ఆ ఊరు అలా ఖాళీగానే ఉంది.
దీంతో ఈ ఊరిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు స్పెయిన్ అధికారులు. దీని ధరను రెండు కోట్ల 24 లక్షలుగా నిర్ణయించారు.
ఏ దేశస్థులైనా కొనుక్కునే సదుపాయాన్ని కూడా ఇచ్చారు స్పెయిన్ అధికారులు.