జొన్నపిండితో కేకు ... తింటే ఎంతో బలం


జొన్న పిండి - ఒక కప్పు
క్యారెట్ తురుము - ఒక కప్పు
అరటి పండ్లు - రెండు
పాలు - అర కప్పు
బెల్లం పొడి - కప్పు



బటర్ - 3 టీ స్పూన్లు
బేకింగ్ పొడి - అర స్పూను
బేకింగ్ సోడా - అర స్పూను
బాదం పప్పులు - అర కప్పు
దాల్చిన చెక్క పొడి - అర స్పూను
ఉప్పు - చిటికెడు


కళాయిలో జొన్నపిండిని దోరగా వేయించుకుని ఒక గిన్నెలో వేయాలి. అందులో అరటిపండును మెత్తగా నలిపి పేస్టులా చేసుకోవాలి.

అందులో బటర్, బేకింగ్ సోడా, బేకింగ్ పొడి, దాల్చిన చెక్క పొడి, బెల్లం పొడి, క్యారెట్ తురుము అని వేసి బాగా గిలక్కొట్టాలి.

అందులో గోరువెచ్చని పాలు వేసి బాగా గిలక్కొట్టాలి. మరీ మందంగా కాకుండా చూసుకోవాలి.

మౌల్డ్‌కు కాస్త వెన్న రాసి, పిండి చల్లి కేకు మిశ్రమాన్ని వేయాలి. బాదం పప్పులు పైన చల్లాలి.

ముందుగా మైక్రో ఓవెన్‌ను 180 డిగ్రీలు ప్రీ హీట్ చేసుకోవాలి. అందులో కేకు మౌల్డ్ పెట్టాలి.

సరిగ్గా 45 నిమిషాల పాటూ ఉంచితే కేకు సిద్ధమవుతుంది.