మేనరికపు పెళ్లిళ్లు ఎందుకు వద్దు?


ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకుంటే రాని సమస్యలు, మేనరికపు సంబంధంలో పుట్టే పిల్లలకే ఎందుకు వస్తున్నాయి?

మేనరికం సంబంధాలంటే అన్నదమ్ముల పిల్లలను, అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇస్తారు. అలాగే మేనమామలను లేదా మేన కోడళ్లను పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది.

మేనరికంలో భార్యాభర్తల జన్యు మూలాలు ఒకే వ్యక్తుల నుంచి వస్తాయి. ఒకరి జన్యువుల్లో లోపం ఉంటే, మరొకరి జన్యువుల్లో కూడా అదే లోపం ఉండే అవకాశం ఉంది.

రెండు లోపభూయిష్టమైన జన్యువులు కలిస్తే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశం తక్కువ.ఏవైనా అనారోగ్య సమస్యలు, అవకరాలు ఉన్న పిల్లలు పుట్టవచ్చు.

ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు పెళ్లి చేసుకుంటే, అలాంటి వారిలో 400 జంటల్లో ఒక జంటకు అవకరాలు ఉన్న బిడ్డ పుట్టే అవకాశం ఉంది.

మేనరికపు వివాహాల్లో 200 జంటల్లో ఒక జంటకు లోపాలతో పిల్లలు పుట్టే ఛాన్సు ఉంది.

అందుకే మేనరికపు వివాహాలు వద్దని వైద్య శాస్త్రం గట్టిగా చెబుతోంది.