డయాబెటిస్ రోగులకు స్మోకింగ్ అస్సలు మంచిది కాదు. సిగరెట్‌లోని నికోటిన్ శరీరంలో ఇన్సులిన్ నిరోదకతను పెంచుతుంది.

సాధారణంగా స్మోకింగ్ ప్రాణాలకు చాలా ప్రమాదకరం. డయాబెటిస్ రోగులకు ఆ అలవాటు ఉంటే మరణం తప్పదు.

స్మోకింగ్, పొగాకు అలవాట్ల వల్ల గుండెలోని ధమనులు గట్టిపడతాయి.

మధుమేహం బాధితులు పొగ తాగితే గుండె జబ్బులు వస్తాయి.

స్మోకింగ్ అలవాటు ఉన్న డయాబెటిస్ రోగులు ఎక్కువగా కిడ్నీ వ్యాధులకు గురవ్వుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

దూమపానం మధుమేహ రోగులలో గ్లూకోస్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.

గ్లూకోస్ స్థాయిలు అసాధారణంగా ఉంటే గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది.

మధుమేహంతో బాధపడేవారు పొగ తాగితే నరాలు దెబ్బతింటాయి.

డయాబెటిస్ లేనివారు పొగతాగితే.. Type-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

మధుమేహం బాధితులు పొగ తాగితే అల్బుమినూరియా వస్తుంది. అంటే మూత్రంలో అల్బుమిన్ స్థాయిలు పెరుగుతాయి.

Image Credit: Pexel, Pixabay