వీటిని తింటే చలిని తట్టుకునే శక్తి వస్తుంది శీతాకాలంలో చలిని తట్టుకోలేకపోతున్నారా? అయితే ఈ ఆహారాలను తిని చూడండి, శరీరంలో వేడి పుడుతుంది. బెల్లం వంటకాలు శరీరంలో వేడిని పుట్టిస్తుంది. చలి తక్కువ వేస్తుంది. తినే ఆహారంలో ఒక స్పూను నెయ్యి వేసి తినాలి. నెయ్యి కూడా శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతలను అందిస్తుంది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలతో రకరకాల వంటలు వండుకోవచ్చు. చలి వేస్తున్న సమయంలో వేడి వేడి అల్లం టీ తాగి చూడండి ఎంత ఉపశమనంగా అనిపిస్తుందో. పుల్లని పండ్లు కూడా తినాలి. నిమ్మకాయను ఆహారంలో పిండుకుని తినడం అలవాటు చేసుకోవాలి. నువ్వులు కూడా చలికాలంలో కచ్చితంగా తినాల్సినవి. ఇవి కూడా శరీరంలో ఉష్ణోగ్రతను పుట్టించి చలిని దూరం చేస్తుంది. చికెన్ సూప్స్, కార్న్ సూప్, టమాటో సూప్ వంటివి వేడి వేడిగా సాయంత్రం వేళ తాగుతూ ఉండాలి.