తందూరి ఎగ్ ఫ్రై - ఈజీ అండ్ టేస్టీ


గుడ్లు - నాలుగు
పెరుగు - నాలుగు స్పూన్లు
శెనగపిండి - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు



కారం - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
చాట్ మసాలా - అర టీస్పూను
తందూరీ మసాలా - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా


ఉడకబెట్టిన గుడ్లను సగానికి కోసి పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో పెరుగు, శెనగపిండి, నిమ్మరసం, కారం, తందూరి మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.

గుడ్డు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా మారినేట్ చేయాలి.

గ్రిల్ పాన్‌లో ఒక స్పూను నూనె వేసి వేడి చేయాలి. ఆ పాన్లో మారినేట్ చేసిన గుడ్లను వేసి వేయించాలి.

ఓవెన్లో వండే వాళ్లు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద పది నిమిషాల పాటూ గుడ్లను గ్రిల్ చేయాలి.

గుడ్లు బాగా వేగాక పైన చాట్ మసాలా, కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి.