బననా మిల్క్ షేక్ అస్సలు వద్దు. అది జీర్ణ క్రియను తగ్గిస్తుంది, నిద్రకు భంగం కలిగిస్తుంది. బాడీ బిల్డర్స్‌కు, బరువు పెరగాలనుకునే వారికి అరటిపండు, పాలు ఒక మంచి కాంబినేషన్. కానీ, ఉబ్బసం బాధితులు అలా తాగితే.. శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తీసుకుంటే టాక్సిన్స్ ఉత్పత్తవుతాయి. దానివల్ల సైనస్, ముక్కు దిబ్బడ, జలుబు, అలర్జీలకు గురయ్యే ప్రమాదం ఉంది. పాలు తియ్యగా, బనాన కాస్త పుల్లగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ గందరగోళానికి గురవ్వుతుంది. దాని వల్ల శరీరంలో టాక్సీన్స్, అలర్జీలు ఇంకా ఇతర సమస్యలు ఏర్పడతాయి. అవి రెండూ కలిపి తీసుకుంటే వ్యాధులకు కారణమయ్యే 'అమ' అనే విషపూరిత పదార్థాన్ని విడుదల అవుతుంది. వీటి కాంబినేషన్ జీర్ణ మంట(డైజెస్టివ్ ఫైర్)ను తగ్గించి పేగు కణజాలానికి నష్టం కలిగిస్తుంది. గుండె జబ్బులకు, వాంతులకు, లూజ్ మోషన్స్ కు కారణమవుతుంది. వీటిని వేర్వేరుగా తింటే ఆరోగ్యకరం, కలిపి తింటే ప్రమాదకరమని ఆహార నిపుణులు చెబుతున్నారు. Image Credit: Pexel, Pixabay