పరోటా అందరికీ ఎంతో ఇష్టమైన అల్పాహారం. పెరుగు, అచార్ తో వడ్డించే ఈ అల్పాహారం ఆరోగ్యకరమైన భోజనం కూడా.

పరోటాలు చేసేందుకు పిండిని కలుపుకునేందుకు గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి.

పిండిని కలుపుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జోడించుకోవాలి. దీని వల్ల మృదువుగా వస్తాయి.

పరోటా కాల్చే విధానం కూడా దానికి మరింత రుచిని తెచ్చి పెడుతుంది. స్టవ్ మీద మంట సరిగా ఉండేలా చూసుకోవాలి.

పిండి ఉండలు రుద్దే సమయంలో చివర్ల మందంగా లేదా మరీ సన్నగా చేయకూడదు. అలా చేస్తే అది కాల్చే సమయంలో విరిగిపోతాయి.

పిండి కలిపి పెట్టుకున్న తర్వాత కనీసం 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. గిన్నె మీద కాటన్ తడి వస్త్రం వేసి కప్పి ఉంచాలి.

పరోటాలు మృదువుగా రావాలంటే పిండి కలిపేటప్పుడు అందులో పెరుగు లేదా పాలు జోడించుకోవచ్చు. పాలు కాస్త వెచ్చగా ఉండాలి.

పాలు లేదా పెరుగు వేయడం వల్ల పరోటాలు చల్లబడిన తర్వాత కూడా మృదువుగా ఉంటాయి.

పరోటాలు తయారు చేసేటప్పుడు రోటీకి వేసినట్టుగా కాకుండా ఎక్కువ పిండి వేసి రుద్దుకోవాలి.

Thanks for Reading. UP NEXT

పాలు, అరటి పండు కలిపి తీసుకుంటున్నారా? జాగ్రత్త!

View next story