పచ్చి పాలు ముఖంపై రాసుకుంటే ఏమవుతుందో తెలుసా? పచ్చి పాలలో చాలా విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఒత్తిడి, ఎండ, మురికి,కాలుష్యం కారణంగా పాడైన చర్మాన్ని పచ్చి పాలు మళ్లీ మెరిసేలా చేస్తాయి. జిడ్డు చర్మం కలవారు పచ్చిపాలు రాసుకుంటే జిడ్డును తొలగించుకోవచ్చు. ముఖంపై కొందరికి డార్క్ స్పాట్స్ పడతాయి. వాటిని పచ్చిపాలతో పొగొట్టుకోవచ్చు. పొడి చర్మానికి పచ్చి పాలు రాస్తే, వారి చర్మం మాయిశ్చర్ అవుతుంది. పచ్చిపాలు తరచూ రాసే వారికి మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. పచ్చిపాలు యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తాయి. రోజు ముఖానికి పచ్చిపాలు రాసుకుని ఒక గంట పాటూ వదిలేయాలి. రెండు వారాలు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.