జేమ్స్ బాండ్ స్నానం గురించి తెలుసా? జేమ్స్ బాండ్ షవర్ చాలా పాపులర్. ఆయన సినిమాలు చూసిన వారికి ఈ స్నానం గురించి ఐడియా ఉంటుంది. ముందుగా వేడి నీటితో స్నానం మొదలుపెట్టి, చివరికి చల్లనీళ్లతో స్నానాన్ని ముగిస్తాడు జేమ్స్ బాండ్. అదే జేమ్స్ బాండ్ షవర్. ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరమంతటా రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది. మగవారు ఈ స్నానం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు 15 శాతం పెరిగే అవకాశం ఉంది. డిప్రెషన్‌తో బాధపడే వాళ్లు ఈ స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఈ స్నానం చాలా మేలు చేస్తుంది.