భోజనం తరువాత సోంపు తింటే ఏమవుతుంది? సోంపు తినకుండా చాలా మంది భోజనం పూర్తి కాదు. రోజూ సోంపు తినడం మంచిదేనా? పూర్వకాలం నుంచి సోంపు తినడం అలవాటుంది. జీర్ణ సమస్యలు తీర్చడంలో సోంపు ముందుంటుంది. వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు కూడా ఎక్కువ. సోంపు గింజలు తినడం వల్ల క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అధ్యయనం ప్రకారం సోంపు గింజల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటే శక్తి ఉంటుంది. పాలిచ్చే తల్లులు వీటిని తినడం వల్ల పాలు పుష్కలంగా పడతాయి. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అందుకే భోజనం తిన్న వెంటనే సోంపు గింజలు తినాలి. మలబద్ధకం సమస్య రాకుండా ఇవి అడ్డుకుంటాయి.