బ్రౌన్ రైస్ తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుందా? దంపుడు బియ్యం రంగు తక్కువగా, ముతకగా ఉంటాయి, అందుకే వాటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్యం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. హార్వర్డ్ పరిశోధకులు చెప్పిన ప్రకారం తెల్లబియ్యాన్ని వారంలో 5 సార్ల కన్నా ఎక్కువ సార్లు తినే వారిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. దంపుడు బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పూర్తిగా దంపుడు బియ్యం తినలేం అనుకునే వారు, తెల్లబియ్యం, దంపుడు బియ్యం కలిపి వండుకుంటే మంచిది. ఇలా తినడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు 16 శాతం తగ్గుతుంది. ఈ బియ్యంలో ఉండే పిండి పదార్థాలు వేగంగా జీర్ణం కావు.కాబట్టి రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు తక్కువ. దంపుడు బియ్యంలో సోడియం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి రక్తపోటు పెరిగే అవకాశం తగ్గుతుంది.