ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన, గొప్ప ఔషధ గుణాలు ఉన్న కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ, టీకి బదులుగా కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల చర్మానికి ఆరోగ్యం లభించడంతోపాటు మంచి మెరుపు వస్తుందట. కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల కెఫీన్ వల్ల పొందే ప్రయోజనాల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చట. ఈ నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఆకృతి కూడా బాగుంటుంది. కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అడ్డుకుంటుంది. దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, యాలకులు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. కొద్దిగా చల్లబడిన తర్వాత వాటిని వడకట్టి అందులో తేనె కలుపుకోవచ్చు. చివరగా బాదం పప్పు పొడి వేసుకుని తాగాలి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. నెయ్యి లేదా పాలతో కలిపి తీసుకున్నప్పుడు రక్తపోటుని తగ్గిస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. 6-8 వారాల పాటు ఈ నీటిని తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మంచిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.