పాన్ కేవలం నోటిని తాజాగా ఉంచడమే కాదు అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ నొప్పి సమస్యలను సులభం చేస్తుంది. అజీర్ణం వల్ల కడుపు నొప్పి, బరువుగా అనిపించడం, వికారంగా అనిపిస్తుంది. పాన్ తింటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. భోజనం తరువాత పాన్ తింటే అది జీర్ణ రసాల ఉత్త్పత్తిని పెంచి జీర్ణ క్రియను సులభం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం, నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకు లాలాజల ఉత్త్పత్తులను ప్రేరేపిస్తుంది. దీనిలోని ఎంజైమ్స్ ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణ క్రియను సులువు చేస్తాయి. తమలపాకు యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ - C, థయామిన్, నియాసిన్, రిబోఫ్లెవిన్,కెరోటిన్ లను కలిగి ఉంటుంది. తమలపాకులోని యాంటిఆక్సిడెంట్స్ కడుపులో PH స్థాయిల నిర్వహణలో సహాయపడతాయి. తమలపాకు తినడం నచ్చనట్లయితే.. దాని నూనెను కడుపుపై మర్దనా చేసుకున్నా సరిపోతుంది. అలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ రసాలు, జీర్ణ రసాల విడుదలకు సహాయపడుతుంది. పాన్ తినడానికి మీ భోజనానికి మధ్య కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోండి. Image Credit: Pixabay, Pexel, Unsplash