కొబ్బరి వడలు - టేస్టీ చిరుతిండి

కొబ్బరి కోరు – అర కప్పు
బియ్యం - ఒక కప్పు
బియ్యంప్పిండి - పావు కప్పు
జీలకర్ర పొడి - ఒక టీస్పూను
ఉప్పు – తగినంత
నూనె – సరిపడినంత

బియ్యం నాలుగైదు గంటలు నానబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి.

ఆ రుబ్బులోనే కొబ్బరి కోరు, ఉప్పు కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. గారెల్లా వేసుకోవడానికి గట్టిగా రుబ్బుకోవాలి.

రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేయాలి. అందులో బియ్యంప్పిండి వేసి కలుపుకోవాలి.

చిన్నముద్ద తీసుకుని అరిటాకు లేదా పాలిథిన్ కవర్ పై గారెల్లా ఒత్తుకోవాలి.

కళాయిలో నూనె వేడెక్కాక అందులో ఒత్తుకున్న గారెలను వేయించుకోవాలి.

అవి పూరీల్లా పొంగుతాయి. రుచి అదిరిపోతుంది.

కొంతమంది వీటిలో పంచదార కూడా కలుపుకుంటారు.