95 శాతం నీటితో ఉండే కీరదోస తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఇందులో విటమిన్ బి, సి, కె, పొటాషియం, కాపర్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

శరీరం నుంచి టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

ఇందులో ఉండే ఫిసేటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లేవనాల్ మెదడు ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యని తొలగిస్తుంది.

అండాశయం, గర్భాశయం, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ ని తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ కణాలని అడ్డుకుంటాయి.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మం మంట, దురద వంటి సమస్యల్ని నయం చేస్తుంది.

కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపేస్తుంది.

మధుమేహులకి మంచిదే. అయితే జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు చలికాలంలో దీనికి దూరంగా ఉండటమే మంచిది.