కొరియన్ సినిమాల్లో లావుగా ఉండే వ్యక్తులను కనిపెట్టండి చూద్దాం. కష్టం కదూ.

ఎందుకంటే కొరియన్స్ ఫుడ్, అలవాట్లు అలాంటివి మరి. బరువంటే వారికి భయం.

అందుకే, నిత్యం వారు సమతుల్య ఆహారాన్ని తింటారు. ఇష్టమైన ఫుడ్‌ను కూడా పరిమితిగా తింటారు.

అంతేకాదు, దూర ప్రాంతాల మినహా మరెక్కడికైనా వెళ్లాలంటే నడకనే నమ్ముకుంటారు.

మన ఊరగాయల తరహాలో కొరియన్లు ఎక్కువగా పులియబెట్టిన పచ్చళ్లను ఆహారంతో తీసుకుంటారు.

పులియబెట్టిన ఆహారం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కొవ్వు పట్టమన్నా పట్టదు. ఫలితంగా బరువు పెరగరు.

ఆహారం తినేందుకు చేతులు, స్పూన్లు వాడరు. స్టిక్స్ ఉపయోగిస్తారు. దానివల్ల తక్కువ ఆహారాన్ని తినగలగుతారు.

కొరియన్లు ఎక్కువగా సముద్రంలో పెరిగే సీ-వీడ్‌లను ఆహారంగా తీసుకుంటారు.

సీ-వీడ్స్‌లో బోలెడన్ని విటమిన్స్ ఉంటాయి. ఇందులోని ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ పెరుగవుతుంది.

Images Credit: Pexels and Pixabay