చాలా మందికి డిన్నర్ తర్వాత స్వీట్ తినే అలవాటుంటుంది. ఇది అంత మంచి అలవాటు కాదని అంటున్నారు నిపుణులు రాత్రి భోజనం తర్వాత తినే డెజర్ట్ లు శరీరానికి చేసే హాని గురించి కొత్త అధ్యయాన వివరాలు తెలుసుకుందాం. రాత్రి పూట తరచుగా డిజర్ట్ తినేవారిలో జీవక్రియల వేగం మందగించి చాలా సులభంగా బరువు పెరుగుతారు. రాత్రి తీసుకునే డిజర్ట్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణం అవుతుంది. రాత్రి పూట తినే స్వీట్ నోటిలో దంతక్షయానికి కారణం అవుతుంది. ఈ అలవాటు నుంచి బయటపడేందుకు కొన్ని సులభ మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు. తక్కువ క్యాలరీల భోజనం కడుపు నిండుగా తినాలి. ఇది తీపి తినాలనే కోరికను అదుపు చేస్తుంది. క్రేవింగ్స్ మరీ ఎక్కువగా ఉంటే సహజమైన చక్కెరలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. Images courtesy : Pexels