ఐరన్ మనకు శాకాహార, మాంసాహార పదార్థాల ద్వారా అందుతుంది. మాంసాహారంలో దొరికేది హెమ్ ఐరన్, శాకాహారంలో దొరికేది నాన్ హెమ్ ఐరన్ ఏ పండులో ఐరన్ ఎక్కువో తెలుసుకుందాం. అవకాడోలో 0.3 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. ఇది రోజువారీ ఐరన్ అవసరంలో 2 శాతం. స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి తో పాటు ఉంటుంది కనుక ఐరన్ శోషణ పెరుగుతుంది. ఒక మోతాదు పరిమాణంలో ఉన్న వాటర్ మిలన్ నుంచి 1.5 మి.గ్రా. ఐరన్ దొరకుతుంది. వందగ్రాముల ఖర్జురాల నుంచి 0.3 నుంచి10.4 మి.గ్రా వరకు ఐరన్ లభిస్తుంది. అంజీర పండు శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గకుండా నివారిస్తాయి. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. Images courtesy : Pexels