పుట్టగొడుగులు విటమిన్లు బి, డితో పాటు ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాహారం.

పుట్టగొడుగులతో ఇమ్యూనిటి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది.

కొన్ని రకాల పుట్టగొడుగులు ఎండ తగిలినపుడు విటమిన్ డి ఉత్పత్తి చేసి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పుట్టగొడుగుల్లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కనుక వీటితో బరువు తగ్గవచ్చు.

కొన్ని రకాల పుట్టగొడుగుల్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి.

కొన్ని రకాల పుట్టగొడుగులతో రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కనుక డయాబెటిక్స్ కి మంచి ఆహారం.

జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు వీటిలోని ఫైబర్స్ దోహదం చేస్తాయి. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇలా పుట్టగొడుగులు ఇమ్యూనిటి పెంచడం నుంచి, బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యం వరకు ఎన్నో రకాలుగా మేలు చేసే ఆహారం.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Images courtesy : Pexels