పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి వాటిలో చక్కెరలు, అదనపు క్యాలరీలు ఉంటాయి. కనుక పండ్ల రసాలు మానేసి పండు పూర్తిగా తినడం మంచిది. గ్రనోలా బార్స్ ఆరోగ్యకరమని అంటే నమ్మకండి. వీటిలో చాలా ప్రిజర్వేటివ్స్, బైండింగ్ షుగర్స్ ఉంటాయి. బరువు పెరుగుతారు. ఏ రూపంలో తీసుకున్నా ఆల్కహాల్ అనారోగ్యకరమే. ఆల్కాహాల్ తో బరువు గణనీయంగా పెరుగుతారు. కనుక మానెయ్యడం మంచిది. సోడా కలిగిన సాఫ్ట్ డ్రింక్స్ లో చాలా చక్కెరలు ఉంటాయి. బరువు పెరగడం మాత్రమే కాదు డయాబెటిస్ ముప్పు కూడా తప్పదు. మైదా ఉపయోగించి చేసే రకరకాల బ్రెడ్స్, బేక్ చేసిన పఫ్స్ వంటివి ఏవైనా సరే బరువు పెంచడమే కాదు, అనారోగ్యాలకు కారణం అవుతాయి. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. Images courtesy : Pexels