ప్రయాణంలో ఉన్నపుడు తప్పకుండా న్యూట్రిషన్ మీద దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక నాలుగు గంటల ప్రయాణమైనా సరే చిన్న మోతాదులో పుడ్ ప్యాక్ చేసుకోవాలట.

బాదాములు, డ్రై అంజీరా, దానిమ్మ గింజల, ఆరెంజెస్, ఆపిల్స్, మంచి నీళ్లు ప్యాక్ చేసుకోవడం మంచిది.

ఇలా ఇంటి నుంచి పుష్టికరమైన ఆహారం వెంట ఉంచుకుంటే ప్రయాణంలో అనారోగ్యకరమైన స్నాకింగ్ ను నివారించవచ్చు.

వేపుళ్లు కంటే పండ్లు ప్రయాణానికి మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు.

పండ్లు కడుపు నిండుగా ఉంచే స్నాక్ గా చెప్పుకోవచ్చు. వీటితో విటమిన్లు, ఫైబర్ ఇతర పోషకాలన్నీ అందుతాయి.

పండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బావుంటుంది. షుగర్ స్థాయిల్లో మార్పులు పెద్దగా ఉండవు. హైడ్రేటెడ్ గా కూడా ఉండొచ్చు.

ఉడికించి, వేయించిన శనగలు కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ప్రొటీన్ తోపాటు ఫైబర్, మెగ్నీషియం, పోలేట్ వంటి పోషకాలు కూడా అందుతాయి.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels