పన్నీర్, చికెన్ రెండింటిలో ఏది మంచి ఎంపిక అనే విషయం గురించిన చర్చ సాగుతూనే ఉంది. పన్నీర్ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫలితంగా జలుబు, బ్రాంకైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతి 100 గ్రాముల చికెన్ నుంచి 31 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అదే పన్నీర్ తో పోల్చితే 10 గ్రాముల ప్రొటీన్ ఎక్కువ. ప్రొటీన్ తీసుకోవాలని అనుకుంటే చికెన్ మంచిది. వెజిటేరియన్లకు పన్నీర్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. విటమిన్ బి12 తో పాటు ఐరన్, నియాసిన్, ఫాస్ఫరస్ వంటి చాలా పోషకాలు చికెన్ లో ఉంటాయి. పనీర్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు గుండె ఆరోగ్యానికి, కండరాల దృఢత్వాన్ని ఇస్తుంది. 100 గ్రాముల చికెన్ లో 165 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. క్యాలరీలు తగ్గించుకోవాలనుకుంటే చికెన్ తినడం మంచిది. 100 గ్రాముల పన్నీర్ లో 265 నుంచి 320 క్యాలరీలు ఉంటాయి. బరువు పెరిగేందుకు పన్నీర్ మంచి ఎంపిక. పన్నీర్ చికెన్ రెండింటిని ఇష్టపడే వారు మీ ఆహార లక్ష్యాన్ని అనుసరించి ఏది తినడం మంచిదో నిర్ణయించుకోవాలి.