డ్రైఫ్రూట్స్ చాలా పోషకాలు కలిగిన బలవర్ధకమైన ఆహారం. చలికాలంలో వెచ్చగా ఉండేందుకు ఉత్తర భారతదేశంలో డ్రైఫ్రూట్స్ ను విరివిగా ఉపయోగిస్తారు. డ్రైఫ్రూట్స్ తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాని మోతాదుకు మించి తింటే నష్టమేనట. మరెలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు రావచ్చు. అందువల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ వంటి సమస్యలు వేధిస్తాయి. కొన్ని డ్రైఫ్రూట్స్ లో అదనంగా చక్కెరలు ఉంటాయి. వీటితో షుగర్ స్థాయిలు పెరగొచ్చు. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. డ్రైఫ్రూట్స్ లో ఉండే హై ఫైబర్ వల్ల త్వరగా జీర్ణం కావు. ఫలితంగా డయేరియా లేదా మలబద్దకం వంటి గ్యాస్ట్రోఇంటర్ స్టయినల్ సమస్యలు ఎదురు కావచ్చు. కొంత మందికి నట్స్ అలర్జీ ఉంటుంది. అలాంటి వారు వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels