డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇవి చర్మ రక్షణలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. డార్క్ చాక్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెరిసే చర్మాన్ని అందిస్తాయి. రక్తప్రసరణను పెంచి.. చర్మానికి మంచి హైడ్రేషన్‌ను అందిస్తాయి. చర్మానికి హాని చేసే యూవీ కిరణాల నుంచి స్కిన్‌ని రక్షిస్తాయి. ఒత్తిడిని వల్ల చర్మం వాడిపోతూ ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అవసరమైన కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. చర్మం హెల్తీగా, మంచి గ్లోతో ఉండేలా చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి.