పెరుగు తింటే నిద్ర ముంచుకొస్తుందనే సంగతి తెలిసిందే.

సాధారణంగా పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ వల్లే అలా జరుగుతుంది.

‘ట్రిప్టోఫాన్’ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ను తయారు చేస్తుంది.

మెలోనిన్ వల్ల పెరుగు తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది.

పెరుగు మాత్రమే కాదు ట్రిప్టోఫాన్ కలిగిన ఏ ఆహారాన్ని తిన్న ఇదే ప్రభావం పడుతుంది.

ట్రిప్టోఫాన్‌లో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్ హార్మొన్లు నిద్రకు ప్రేరేపిస్తాయి.

పెరుగు ఆరోగ్యానికి మంచిదే. పెరుగు జీర్ణక్రియను పెంపొందిస్తుంది.

పెరుగు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

అయితే, రాత్రివేళ మాత్రం పెరుగు తినకపోవడమే ఉత్తమం.

రాత్రివేళ పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది.

మీకు జలుబు ఉంటే శ్లేష్మం తీవ్రత మరింత పెరుగుతుంది

ఆస్తమా లేదా ఉబ్బసం ఉన్నట్లయితే పెరుగు తినకపోవడమే ఉత్తమం.

Image Credit: Pexels and Others