కాకినాడ జిల్లాలో ఓ పులి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది.
ఆ పులిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు ఎంతో ప్రయత్నిస్తున్నారు.
కానీ, ఆ పులి మాత్రం అధికారులకు చిక్కుకుండా తప్పించుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ నటి అనన్య నాగళ్లకు వింత రిక్వెస్ట్ పెట్టాడు.
ఇటీవల ఆమె థాయ్‌లాండ్‌లో పులితో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.
కాకినాడ పులితో అచ్చికబుచ్చికలాడి పట్టుకోవచ్చుగా అని అడిగాడు.
ఆ పని చేస్తే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నాడు.
ఇందుకు అనన్య ‘‘ఒకే వచ్చేస్తున్నా, డోన్ట్ వర్రీ’’ అని రిప్లై ఇచ్చింది.
దీంతో నెటిజనులు ‘‘అనన్య నువ్వు చాలా చిలిపి సుమీ’’ అని అంటున్నారు.
Credits: Ananya Nagalla/Instagram