పురుషుల్లో అంగస్తంభనకు ఉపయోగించే ‘వయాగ్రా’ క్యాన్సర్‌ను నయం చేస్తుందా?

వైద్య నిపుణులు ఔననే చెబుతున్నారు. ఇది కిమోథెరపీ ప్రక్రియను సులభతరం చేస్తుందట.

యూకేకు చెందిన ఓ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

క్యాన్సర్‌ కణానికి రక్షణ కవచంగా ఉండే ఎంజైమ్లను వయాగ్రా నాశనం చేస్తుందట.

దాని వల్ల కిమో డ్రగ్స్.. రక్షణ కోల్పోయిన క్యాన్సర్ గడ్డలను సులభంగా నాశనం చేశాయట.

గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఇది బాగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వచ్చాయి.

కీమోతో కలిపి ‘PDE5 ఇన్హిబిటర్స్’ అనే వయాగ్రాను ఎలుకలపై ప్రయోగించారు.

ఫలితంగా క్యాన్సర్ కణాలకు రక్షణగా ఉండే ఎంజైమ్‌ల స్థాయిలు తగ్గాయి.

క్యాన్సర్ కణాలు.. నేరుగా కిమోకు గురయ్యేందుకు సహకరించాయి.

దీంతో కిమో, వయగ్రా కాంబినేషన్లో మందులను తయారు చేసే యోచనలో నిపుణులున్నారు.

Images Credit: Pexels, Unsplash and others

Follow for more Web Stories: ABP LIVE Visual Stories