మధ్యాహ్న భోజనంలో పెరుగు ఎందుకు తినాలి?



పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకు తినాలో కూడా వివరిస్తున్నారు.



రాత్రి వేళల్లో పెరుగు తినడం వల్ల పొట్టలో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మధ్యాహ్నం తినాలి.



పెరుగు తింటే ఒత్తిడి హార్మోన్లు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.



పెరుగను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



స్త్రీలు కచ్చితంగా పెరుగును తినాలి. ఇది యోనిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.



పెరుగును తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.



పెరుగు వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది.



పొట్ట సంబంధిత సమస్యలేవీ రాకుండా పెరుగు అడ్డుకుంటుంది.