చలికాలంలో వేరుశెనగలు ఎందుకు తినాలి? వేరుశెనగ పలుకులు శీతాకాలంలో కచ్చితంగా తినాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఇనుము, సెలీనియం, విటమిన్ 6 పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చర్మానికి మెరుపు అందిస్తాయి. జుట్టు ఊడిపోకుండా కాపాడతాయి. వేరుశెనగ పిల్లలకు తినిపిస్తే ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని తినవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు మెదడుకు శక్తినిస్తాయి.