శీతాకాలంలో పెదవులు పొడి బారిపోయి నిర్జీవంగా కనిపిస్తాయి. చూసేందుకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.

అందమైన మృదువైన పెదవులు పొందాలంటే ఈ ఇంటింటి చిట్కాలు ట్రై చేసి చూడండి. ఎర్రటి పెదవులు మీ సొంతం అవుతాయి.

విటమిన్ ఇ క్యాప్సూల్స్ లోని ఆయిల్ పెదాలకి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కొల్లాజెన్ అందుతుంది.

కొత్తిమీర పేస్ట్ పెదవులకి రాసుకుంటే మంచిది. మృదువుగా మారిపోతాయి.

పెదవులకి తేనె పూయడం వల్ల పగుళ్లు తొలగిపోయి తేమగా ఉంటాయి.

గులాబీ రేకులు పాలలో కాసేపు నానబెట్టి దాన్ని పెదవులకు రాసుకోవచ్చు. ఇలా చేస్తే ఎర్రగా ఉంటాయి.

దోసకాయ ముక్కలుగా చేసి పెడవులపై అప్లై చేస్తే పొడి పెదాలు హైడ్రేట్ గా మారిపోతాయి.

కలబంద జెల్ పెదాలకి రాయడం వల్ల తేమగా ఉంటాయి. మృతకణాలని తొలగిస్తుంది.

ఇంట్లో తయారుచేసుకునే లిప్ బామ్ లో కోకుమ్ బటర్ వేసుకుని రాసుకుంటే పెదాలు మృదువుగా ఉంటాయి.

సన్ ఫ్లవర్ ఆయిల్ కొద్దిగా పెదాలకు రాసుకుంటే హైడ్రేషన్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

పొడి పెదాలను నయం చేసుకునేందుకు షియా బటర్ నేరుగా రాసుకోవచ్చు.