నీలం రంగులో పసుపు కొమ్ములు భారతదేశంలో అంతరించిపోతున్న అరుదైన మూలికల్లో ఒకటి... నీలంగా ఉండే పసుపుకొమ్ము. దీన్ని హిందీలో ‘కాలీ హల్దీ’ అంటారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వీటిని కొన్నిచోట్ల వాడతారు. ఇది ఎక్కడపడితే అక్కడ పండదు తేమతో కూడిన అటవీ ప్రాంతాల్లోనే పెరుగుతుంది. ఎక్కువగా ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది. దీని రుచి, కాస్త కారంగా చేదుగా ఉండి, వాసన ఘాటైన కర్పూరంలాంటి సువాసనను విడుదల చేస్తుంది. చాలా గిరిజన తెగలలో గాయాలు, చర్మపు సమస్యలకు, పాము, కీటకాల కాటులకు ఈ నీలపు పసుపును పేస్టుగా మార్చి అద్దుతారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయని వారి నమ్మకం. ఈ నీలం పసుపు పొడిని నీళ్లలో కలిపి నుదుటిపై పేస్టులా రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందని చెబుతారు. నీలం పసుపుకు హిందూ దేవత అయిన కాళీమాతకు దగ్గర సంబంధం కలిగి ఉందని ఎంతో మంది నమ్మకం.