వారానికి రెండు సార్లు చేపలు ఎందుకు తినాలి?

నాన్‌వెజ్ ప్రియులకు చేపలంటే ఎంతో ఇష్టం ఉంటుంది.

వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చేపలు తినడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటివి లభిస్తాయి.

మానసిక ఆరోగ్యానికి చేపలు చాలా అవసరం.

వీటిని తరచూ తినే వారిలో మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.

చేపలు అధికంగా తినేవరిలో రుమటాయిట్ ఆర్ధరైటిస్ వచ్చే ఛాన్సు తగ్గుతుంది.

చర్మ సౌందర్యానికి చేపలు చాలా మేలు చేస్తాయి.

క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది.